అతనేం పెద్ద
స్థాయి ఉద్యోగి కాదు కానీ అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను ఏం గొప్ప వక్త కాదు కానీ అందరికీ
నాయకుడయ్యాడు. అతనేం ఆస్తిపరుడు కాదు కానీ
రిటైర్ అయినా కూడా తను పని చేసి ఆ డబ్బులతో వేరే వాళ్లకు అన్నం పెట్టాడు. అతనికేం
టెక్నాలజీ తెలియదు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవాడు. అతనేం జాతీయస్థాయి
నాయకుడు కాదు కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం పట్టించుకున్న పోస్టల్
నాయకుడిగా నిలిచిపోయాడు. అతనికేం పెద్ద బంధుబలగం లేదు కానీ అతని వర్ధంతిని క్రమం తప్పకుండా చేస్తున్న
ఆత్మబంధువులు సంపాదించుకున్నాడు. మనిషి కాస్తంత ఉండేవాడు కానీ వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత
మరెందరికో దిక్సూచిగా నిలిచిన మన జడ సాంబశివరావు వర్ధంతి తేది 07-01-2020 న గుంటూరు కలెక్టరేట్ పోస్ట్ ఆఫీస్ వద్ద కుటుంబ సభ్యులు మరియు పోస్టల్ ఉద్యోగులు మరియు NFPE యూనియన్ ఆద్వర్యంలో జరిగింది.