ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ నందు 191 పోస్టల్ అసిస్టెంట్ , 33 సార్టింగ్ అసిస్టెంట్ ఖాళీలకు అర్హులైన జి డి ఎస్ ల నుండి వ్రాత పరీక్షకు దరఖాస్తులు కోరబడుచున్నవి .
2010 సంవత్సరం 10-10-2010 నెలలో జరిగిన L.G.O పరీక్షలో పోస్ట్ మాన్ మరియు ఎం టి ఎస్ ల నుండి ఎంపిక కాగా మిగిలిన ఖాళీలకు అర్హులైన గ్రామీణడాక్ సేవక్ (GDS) ల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
డిరెక్తోరేట్ ఉత్తర్వుల మేరకు DR-2011 & DR-2012 ఖాళీలకుజరిపే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పరీక్షలతో పాటుగా అదే రోజు అదే సమయములో అధీకృత ఏజెన్సి ద్వారా నిర్వహించ బడును .
జి డి ఎస్ దరఖాస్తుదారుల అర్హత సంబంధిత డివిజనల్ అధికారుల ద్వారా పరిశీలించ బడిన తరువాత రీజినల్ / సర్కిల్ ఆఫీసుకు పంపబడును .
డివిజనల్ అధికారి ద్వారా నోటిఫికేషణ్ తేది -- 10-08-2012
జి డి ఎస్ వివరాలతో డివిజనల్ ఆఫీసు కు దరఖాస్తులు అందజేయ వలసిన తేది -- 27-08-2012
దరఖాస్తులకు ఆఖరు తేది -- 10-09-2012
డివిజన్ వారీగా ఖాళీలు తెలియజేయబడినవి .
కేటగిరి వివరాలు డివిజన్ అధికారులచే నోటిఫికేషన్ లో తెలియజేయ బడును .
సర్కిల్ ఆఫీసు ఉత్తర్వుల కాపి క్రింద ప్రచురించబడినది.