Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

Thanks to our PDF MLC Nageswar who fought for water at Busstands for common man




ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు శుద్ధమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేపట్టిన దీక్షకు ప్రభుత్వం దిగొచ్చింది. వారం రోజుల్లోగా బస్టాండ్లలో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ ద్వారా నాగేశ్వర్ కు హామీ ఇచ్చారు. దీంతో నాగేశ్వర్ దీక్ష విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రయాణికుల నుంచి కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్న ఆర్టీసి వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండుల్లో ప్రయాణికులకు తాగడానికి మంచినీరు దొరకట్లేదని నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఆర్టీసి అధికారులను కలిశానని, సమస్యను పూర్తిస్థాయిలో వారి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అయినా వారిలో చలనం లేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తనకు ఎమ్మెల్సీ కోటాలో విడుదల చేసే నిధులు వెచ్చిస్తానని, ప్రయాణికులకు శుద్ధమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరినప్పటికీ, ఆర్టీసి పెద్దలు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఒక్క లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకు విక్రయిస్తున్నారని, సామాన్య ప్రయాణికుడు అంత డబ్బు ఖర్చు చేసి నీళ్లు కొనుక్కునే స్థితిలో ఉన్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆదాయంతో తన ఖజానా నింపుకుంటున్న ఆర్టీసి వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోందన్నారు. అందుకే తాను దీక్ష చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వం వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిందని, ఈ మేరకు బొత్స సత్యనారాయణ ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. గడువులోపు హామీ నెరవేర్చకుంటే ఏప్రిల్ 15 నుంచి మరోసారి దీక్షకు దిగుతానని హెచ్చరించారు

Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.